: గోడకూలిన ఘటనలో మృతులకు తమిళనాడు సర్కారు నష్టపరిహారం
తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా ఉపరపాలయమ్ వద్ద గోడ కూలిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర సీఎం జయలలిత నష్టపరిహారం ప్రకటించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కాగా, ఈ ఘటనలో 11 మంది తెలుగువారు మరణించిన సంగతి తెలిసిందే.