: సెల్ఫీలను ఫన్నీ స్టిక్కర్లుగా మార్చే యాప్


టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా, సెల్ఫీలను ఫన్నీ స్టిక్కర్లుగా మార్చే సరికొత్త యాప్ రంగప్రవేశం చేయనుంది. జపాన్ కు చెందిన లైన్ కార్పొరేషన్ 'లైన్ సెల్పీ స్టిక్కర్' పేరిట యాప్ ను రూపొందించింది. లైన్ ఇంతకుముందు లైన్ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ తో బాగా పాప్యులరైన సంగతి తెలిసిందే. ఫోన్ ద్వారా సెల్ఫీని క్లిక్కుమనిపించగానే, యాప్ ఆ సెల్ఫీని ఫన్నీ స్టిక్కర్ గా మార్చేస్తుంది. ఈ యాప్ ను ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఉచితంగా పొందవచ్చు.

  • Loading...

More Telugu News