: ఎండీఎస్ ప్రవేశాలపై టి.ప్రభుత్వ వైఖరి అభ్యంతరకరం: మంత్రి కామినేని


హైదరాబాదులోని దంత వైద్య కళాశాలల్లో ఆంధ్ర విద్యార్థుల్ని నిరాకరించడంపై ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మండిపడ్డారు. ఎండీఎస్ ప్రవేశాలపై తెలంగాణ ప్రభుత్వం కొర్రీలు వేయడం తగదని అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన బిల్లులోని 371(డి) నిబంధన ప్రకారం తక్షణమే విద్యార్థులకు అనుమతి ఇవ్వాలని అన్నారు. రెండు రాష్ట్రాల్లోను 371(డి) పదేళ్ల పాటు అమల్లో ఉంటుందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News