: మన బాధలు దేవుడికి మొరపెట్టుకోవడానికి మైకులు అవసరమా?: శరద్ యాదవ్


వివిధ మతాల ప్రార్థనా స్థలాలు, దేవాలయాల వద్ద మైకులు పెట్టి పెద్ద శబ్దాలతో చెవులు తూట్లు పడేలా చేయడం నిత్యం చూస్తూనే ఉంటాం. లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసిన వారికి ఇది బాగానే ఉన్నా... చాలా మంది ప్రజలకు మాత్రం నరకప్రాయంగా ఉంటుంది. దీనిపై జేడీయూ అధినేత శరద్ యాదవ్ మండిపడ్డారు. మన బాధలను దేవుడికి చెప్పుకోవడానికి మైకులు అవసరమా? అని ప్రశ్నించారు. ఈ లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలకు నిద్ర కరవై మానసిక స్థితి దెబ్బతింటుందని అన్నారు. ప్రార్థన స్థలాల వద్ద మైకులను తొలగించేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీ చేయాలని శరద్ యాదవ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News