: నేడు హైదరాబాద్ రానున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఈ మధ్యాహ్నం హైదరాబాదుకు రానున్నారు. నగరంలోని నేషనల్ పోలీస్ అకాడమీలో స్పెషల్ టాక్టిక్స్ వింగ్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. తర్వాత టీఏసీ ట్రైనింగ్ డెమోను వీక్షిస్తారు. అనంతరం జాతీయ భద్రత అనే అంశంపై జరిగే సెమినార్ లో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు.