: డబ్బింగ్ సీరియల్స్ వివాదంపై స్పందించిన అల్లు అరవింద్
మాటీవీ కార్యాలయంపై తెలుగు టీవీ పరిరక్షణ సమితి సభ్యులు నేడు దాడికి పాల్పడడాన్ని నిర్మాత అల్లు అరవింద్ ఖండించారు. దాడిలో ధ్వంసమైన ఆఫీసును పరిశీలించేందుకు ఆయన మాటీవీ కార్యాలయం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబ్బింగ్ సీరియళ్ళు ప్రసారం చేయడంపై ఆయన వివరణ ఇచ్చారు. అనువాద ధారావాహికల ప్రసారం విషయంలో మాటీవీకి జాతీయ చానళ్ళతో ఒప్పందం ఉందని తెలిపారు. తక్షణమే సీరియళ్ళు ఆపితే తమకు కోట్లలో నష్టం వాటిల్లుతుందని అరవింద్ వివరించారు. దశలవారీగా పరభాషా సీరియళ్ళు నిలిపివేస్తామని తెలుగు టీవీ పరిరక్షణ సమితి నేతలకు చెప్పామని, అయినా, తాము చట్టబద్ధంగానే వ్యాపారం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.