: చెవి కొరికిన భారతీయుడు న్యూజిలాండ్ లో జైలుపాలు


తన మాజీ ప్రేయసి మరో వ్యక్తితో సన్నిహితంగా మెలగడాన్ని ఆ భారత సంతతి యువకుడు భరించలేకపోయాడు. న్యూజిలాండ్ లో అనీష్ రావ్ (28) అనే ఈ వ్యక్తి వికాసిని అషారి అనే యువతితో కొంతకాలం వరకు ప్రేమాయణం కొనసాగించాడు. అయితే, వారి మధ్య విభేదాలు పొడసూపడంతో విడిపోయారు. అనంతరం వికాసిని... రితేశ్ రామ్ అనే యువకుడితో సాన్నిహిత్యం పెంచుకుంది. ఇది భరించలేకపోయిన అనీష్ ఓరోజు రాత్రి రితేశ్ పై దాడి చేసి చెవికొరికాడు. అనంతరం అక్కడే ఉన్న వికాసిని ముఖంపై గుద్దాడు. చెవి తెగిపోవడంతో రితేశ్ కు తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో, అనీష్ అక్కడి నుండి పరారయ్యాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆక్లాండ్ పోలీసులు అనీష్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా, అతడికి రెండు సంవత్సరాల మూడు నెలలు జైలుశిక్ష విధించింది. అనీష్ గతేడాది కూడా రితేశ్ ఇంటిపై దాడి చేసి పలు వస్తువులు ధ్వంసం చేశాడు.

  • Loading...

More Telugu News