: ఫెదరర్ పాత రోజులు గుర్తుకు తెచ్చేనా?: నేడు వింబుల్డన్ ఫైనల్
వింబుల్డన్ టోర్నీ తుది మెట్టుకు చేరుకుంది. నేడు పురుషుల విభాగం ఫైనల్లో పాతకాపు రోజర్ ఫెదరర్, సెర్బ్ యోధుడు నోవాక్ జోకోవిచ్ టైటిల్ పోరులో తలపడనున్నారు. గత కొంతకాలంగా నడాల్ జోరుతో మసకబారిన తన ప్రతిష్ఠను ఫెదరర్ ఈ మ్యాచ్ లో గెలుపు ద్వారా అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాడు. అయితే, ప్రత్యర్థి జోకోవిచ్ ను తక్కువగా అంచనా వేస్తే సెంటర్ కోర్టులో కాలేసినట్టే. ఈ సాయంత్రం 6.30(స్టార్ స్పోర్ట్స్-1) కి మొదలయ్యే ఈ పోరు టెన్నిస్ అభిమానులకు మరో చిరస్మరణీయ జ్ఞాపకాన్ని అందించడం ఖాయం. కాగా, నిన్న జరిగిన మహిళల టైటిల్ పోరులో పెట్రా క్విటోవా విజేతగా నిలిచింది. ఫైనల్లో చెక్ క్రీడాకారిణి క్విటోవా 6-3, 6-0తో ఎవగెనీ బౌచర్డ్ (కెనడా) పై నెగ్గింది. క్విటోవాకు ఇది రెండో వింబుల్డన్ టైటిల్. 2011లోనూ క్విటోవా ఈ ఫీట్ సాధించింది.