: రామానాయుడు స్టూడియోపైనా టీవీ ఆర్టిస్టుల దాడి
టీవీ ఆర్టిస్టుల ఆగ్రహానికి రామానాయుడు స్టూడియో కూడా బలైంది. అక్కడ జరుగుతోన్న ఓ టీవీ గేమ్ షో షూటింగ్ ను వారు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. పరిరక్షణ సమితి సభ్యుల దాడిలో షూటింగ్ సామగ్రి ధ్వంసమైంది. కొద్దిగంటల క్రితం తెలుగు టీవీ పరిరక్షణ సమితి ప్రతినిధులు మాటీవీ కార్యాలయంపై దాడి చేసిన సంగతి తెలిసిందే.