: అర్జెంటీనా... ఎన్నాళ్ళకెన్నాళ్ళకు..!


బ్రెజిల్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనా సెమీస్ చేరింది. గతరాత్రి బెల్జియంతో జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా 1-0తో విజయం సాధించింది. మ్యాచ్ మొదలైన 8 నిమిషాలకే వెటరన్ ఫార్వర్డ్ గొంజాలో హిగ్వేన్ గోల్ సాధించి అర్జెంటీనాను ఆధిక్యంలో నిలిపాడు.
సెమీస్ లో అర్జెంటీనా... నెదర్లాండ్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. నెదర్లాండ్స్ జట్టు క్వార్టర్ ఫైనల్లో 4-3 (పెనాల్టీ షూటౌట్) తో కోస్టారికాను చిత్తు చేసింది. కాగా, సాకర్ వరల్డ్ కప్ లో అర్జెంటీనా 24 ఏళ్ళ తర్వాత సెమీస్ లో అడుగుపెట్టింది. 1990 వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఆ జట్టు సెమీస్ చేరడం ఇదే ప్రథమం.

  • Loading...

More Telugu News