: ఉభయ రాష్ట్రాలకు వర్షసూచన
జార్ఖండ్ ఉత్తర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారం రాత్రివరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. అయితే, ఇదే సమయంలో ఖమ్మం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో వడగాడ్పులు తీవ్రంగా వీస్తాయని... నెల్లూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, నల్గొండ జిల్లాల్లో ఓ మోస్తరు వడగాడ్పులు వీస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.