: జీతాలు పెంచండి: చంద్రబాబుతో విద్యుత్ సంఘ నేతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో విద్యుత్ సంఘ నేతలు సమావేశమయ్యారు. తమ వేతనాలు పెంచాలన్న ప్రధాన డిమాండును వారు ముఖ్యమంత్రి ముందు ఉంచారు. సంఘం నాయకులు సంజీవరెడ్డి, సాయిబాబా తదితరులు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.