: ప్రజాస్వామ్య పరిరక్షణలో టీడీపీ విఫలమైంది: మైసూరా
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పరిరక్షణలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత మైసూరారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఒంగోలులో ఓట్లరు కాని వారు ఎన్నికల హాలులోకి ఎలా వెళ్లగలిగారని ప్రశ్నించారు. బాబు ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడలేక, పరిపాలించే అర్హత కోల్పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. తక్షణం ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిషత్ ఎన్నికలు ఈ రోజే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.