: నేపాల్ కు త్వరలో భారత్ ఆర్థిక ప్యాకేజీ!


మన సరిహద్దు దేశాల్లో ఒకటైన నేపాల్ కు త్వరలో అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీని భారత్ ప్రకటించనుందని సమాచారం. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దేశంలో పర్యటించే అవకాశం ఉంది. ఈ సమయంలోనే ప్యాకేజీ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు నేపాల్లో భారతదేశ రాయబారి రంజిత్ రాయ్ ఈ రోజు ఆ దేశ ఆర్థిక మంత్రి రాం షరణ్ మహత్ ను కలిశారు. మోడీ పర్యటన గురించి చర్చించారు. అనంతరం మీడియాతో నేపాల్ ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ప్యాకేజీ గురించి వెల్లడించారు.

  • Loading...

More Telugu News