: ఫీజు రీయింబర్స్ మెంట్ పై కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫీజు రీయింబర్స్ మెంట్ పై సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాదులో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. సమావేశంలో విద్యాసమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై సమగ్రంగా చర్చించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు అవసరమైన విధివిధానాలపై చర్చించారు. 1956కు ముందు తెలంగాణలో నివసించిన వారే లోకల్ అవుతారని, వారికి మాత్రమే ఫీజురీయింబర్స్ మెంట్ వర్తిస్తుందని కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్ర విమర్శలు చెలరేగిన సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించడంపై కూడా చర్చిస్తున్నట్టు సమాచారం.