: గుడ్లు మండుతున్నాయి... కేకుల్లేవు!
గుడ్డు అంటే చాలు గుడ్లు తేలేస్తున్నారు. ఎందుకంటే, దేశ వ్యాప్తంగా గుడ్ల ధర ఆకాశాన్నంటుతోంది. ముంబైలో గుడ్లు కొనాలంటే చాలు బెంబేలెత్తిపోతున్నారు. గుడ్డు ధర 5 రూపాయలు దాటిపోయింది. డజను గుడ్లు 60 రూపాలయల కంటే తక్కువకు దొరకడం లేదు. దీంతో బేకరీలు కూడా బందైపోయాయి. ముంబైలో అతిపెద్ద బేకరీల్లో ఒకటైన మోడ్రన్ బేకరీ గోరెగావ్ లోని యూనిట్ లో ఉత్పత్తి ఆపేసింది. బ్రిటానియా, విబ్స్ కూడా తమ ఉత్పత్తిని ఆపేశాయి.
తమ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించడంతో భద్రతా చర్యలు పెంచేందుకు ఉత్పత్తి ఆపామని కంపెనీలు చెబుతున్నప్పటికీ... అసలు కారణం గుడ్ల ధరేనని సమాచారం. ఆంధ్రప్రదేశ్ సహా గుడ్లు అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోవడంతో గుడ్ల ఉత్పత్తి తగ్గి, ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.