: ఆర్థిక పొదుపు చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం... ఆమోదించిన సీఎం చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక పొదుపు చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు మంత్రుల వినోదాలు, విలాసాలపై ఆంక్షలు విధిస్తోంది. ఇకనుంచీ మంత్రులందరూ విమానాల్లో ఎకనామీ క్లాసుల్లోనే ప్రయాణించాలని సూచించనుంది. అంతేగాక ఎలాంటి స్టార్ హోటల్స్ లోనూ సమావేశాలు నిర్వహించకూడదని మంత్రులకు ఆదేశించనుంది. ఈ మేరకు రూపొందించిన ఫైల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారు. అనంతరం దానిని ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకు పంపారు. త్వరలో ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

  • Loading...

More Telugu News