: భార్యతో మాటామంతీ గుండెకు మంచిదట!
ఎప్పుడూ ఉండేదేగా భార్య, ఆ... ఏం మనసు విప్పి మాట్లాడతాంలే! అని కాసింత నిర్లక్ష్యం ప్రదర్శించే భర్తల కోసమే ఇది. పని ఒత్తిడితో అలసిపోయి ఇంటికి వచ్చినా సరే, అర్ధాంగితో కాసింత ఆప్యాయంగా మాట్లాడితే, ఆ ప్రభావం గుండెకు మేలు చేస్తుందట. అలా కాకుండా చిర్రుబుర్రులాడితే మాత్రం మెడనుంచి పోయే ధమనులు (కరోటిడ్ ఆర్టెరీస్) బిరుసెక్కిపోతాయని, తద్వారా రక్తప్రసరణ సాఫీగా జరగదని, అది కార్డియోవాస్కులార్ సమస్యలకు దారితీస్తుందని అమెరికా వైద్య నిపుణులు అంటున్నారు. మొత్తం 281 మంది మధ్యవయస్కులపై చేపట్టిన పరిశోధన అనంతరం ఈ వివరాలు వెల్లడించారు.