: శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం: కిషన్ రెడ్డి
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదనడం సరికాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హితవు పలికారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రానికి, రాష్ట్రానికి వారధిగా తాము ఉన్నామని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలంగాణ సమస్యలపై కేంద్ర మంత్రులతో చర్చించామని ఆయన వెల్లడించారు. తమకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
హెల్త్ యూనివర్సిటీ, గ్యాస్ పైప్ లైన్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంజూరుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సరైన నివేదికలు ఇస్తే మరిన్ని ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రానికి తేగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.