: 'లార్డ్స్' మ్యాచ్ పై లక్ష్మణ్ ఆసక్తి


నేడు సుప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో జరగనున్న ఎంసీసీ-వరల్డ్ ఎలెవన్ జట్ల మ్యాచ్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ వన్డే మ్యాచ్ పై భారత బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ సైతం ఉత్సుకత కనబరుస్తున్నాడు. మ్యాచ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా...? ఎప్పుడు చూద్దామా? అని ఎదురుచూస్తున్నానని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. బ్యాటింగ్ కింగులు సచిన్, లారా స్పిన్ మాంత్రికులు వార్న్, మురళీధరన్ లను ఎదుర్కొంటుంటే ఆ మజాయే వేరని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ అత్యుత్తమ మైదానంలో అద్భుతమైన మ్యాచ్ ఇది అని ఈ మణికట్టు మాంత్రికుడు అభివర్ణించాడు.

  • Loading...

More Telugu News