: నేను పాడిన పాటలో జాక్వెలిన్ అదిరింది: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సీనియర్ బ్రహ్మచారి సల్మాన్ ఖాన్ ఏ హీరోయిన్ ని ఎలా ఆకాశానికెత్తేస్తాడో ఎవరికీ తెలియదు. తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను సల్మాన్ ప్రశంసల్లో ముంచెత్తాడు. 'కిక్' సినిమాలో తాను ఆలపించిన గీతంలో ఆమె అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా ఫన్నీగా ఉంటుందని పనిలో పనిగా నోరుజారాడు. దీంతో, 'పర్లేదు సల్మాన్ హీరోయిన్లను బాగానే ఫాలో అవుతున్నాడ'ని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో జాక్వెలిన్ కూడా తాను సల్మాన్ ను చూడగానే అతనితో నటించాలని భావించానని, అందుకే సల్లూతో అవకాశం అనగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశానని చెప్పింది.