: మగాడిగా, మహిళగా అంతర్జాతీయ ఫుట్ బాలర్!


పురుషుడిగా, మహిళగా అంతర్జాతీయ స్థాయి ఫుట్ బాల్ ఆడిన వ్యక్తిగా జెయ సాల్వా అనే మహిళను ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ పేర్కొన్నారు. అమెరికాలోని సమోవా దీవిలో 14 ఏళ్ల జానీ సాల్వా అనే అబ్బాయి మంచి ఫుట్ బాల్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఆ దీవి నుంచి అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో అదరగొట్టాడు. అయితే అతనిలో ఫుట్ బాల్ ఆట తప్ప మిగిలిన అన్ని విషయాల్లో అమ్మాయి లక్షణాలు అధికంగా ఉండేవి.
దాంతో జానీ సాల్వా మిగిలిన ఆటగాళ్ల కంటే భిన్నంగా కన్పించేవాడు. అది ఇబ్బందిగా ఉండడంతో లింగ మార్పిడి చేయించుకుని మహిళగా మారాడు. జెయా సాల్వాగా రూపాంతరం చెందాడు. మహిళా ఫుట్ బాల్ క్రీడాకారిణిగా మంచి పేరు సంపాదించుకుంది జెయా సాల్వా. దీంతో సాల్వాను అంతర్జాతీయ స్థాయి తొలి ట్రాన్స్ జెండర్ ఫుట్ బాలర్ గా గుర్తిస్తూ 2011లో ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ ప్రకటించారు.
దీంతో పురుషులతో కలిసి ఫుట్ బాల్ ఆడేందుకు సాల్వాకు పిఫా అనుమతిచ్చింది. సాల్వా మరో ఏడాదిపాటు మాత్రమే ఫుట్ బాల్ ఆడనుంది. హార్మోన్ ట్రీట్మెంట్ కారణంగా ఫుట్ బాల్ కెరీర్ కు గుడ్ బై చెబుతున్నట్టు సాల్వా స్పష్టం చేసింది. తొలి ట్రాన్స్ జెండర్ గా గుర్తింపు పొందడంతో జెయా సాల్వా పేరు ఫుట్ బాల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.

  • Loading...

More Telugu News