: పోలీసుల్ని తన్ని... పత్తాలేకుండా పోయిన ఎమ్మెల్యే


బెంగళూరు యూబీ సిటీలోని స్కైబార్ లో పోలీసులపై దాడి చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్ ఆచూకీ దొరకడం లేదు. బార్ చుట్టు పక్కల వారి ఫిర్యాదుతో ఇద్దరు పోలీసులు స్కైబార్ కు వెళ్లగా, నేనెవరో తెలుసా? గుడ్డలూడదీసి అసెంబ్లీలో తంతానని వీరంగం వేశారు. 'నేనే డిస్టర్ బెన్స్ చేస్తున్నానంటారా?' అంటూ వారిచి చితకబాదారు. దీంతో వారు విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. దానిని సీరియస్ గా తీసుకున్న పోలీసు అధికారులు ఎమ్మెల్యే, అతని ప్రధాన అనుచరులపై కేసులు నమోదు చేశారు.
దీంతో ఎమ్మెల్యేతో పాటు, కేసు తొలి నిందుతుడు, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సోమశేఖర్ గౌడ బెంగళూరు సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ సమర్పించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, అతని అనుచరుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు సమయం ముగిసినా బార్ ఎందుకు తెరిచి ఉంచారని అబ్కారీ శాఖ స్కైబార్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. వారంలోగా సరైన సమాధానం చెప్పని పక్షంలో బార్ లైసెన్స్ రద్దు చేస్తామని అబ్కారీ శాఖ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News