: అమెరికాలో స్మార్ట్ ఫోన్ బాంబుల కలకలం


అమెరికాలో ఫోన్ బాంబుల భయంతో అన్ని విమానాశ్రయాల్లోనూ అదనపు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అల్ ఖైదా తీవ్రవాదులు పంథా మార్చుకుని గుర్తించడానికి వీల్లేని రీతిలో స్మార్ట్ ఫోన్లలోనూ, బూట్లలోనూ బాంబులు అమర్చుతున్నారన్న సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. అమెరికా ప్రభుత్వం అన్ని విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, యూరప్ నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. యెమెన్ లోని అల్ ఖైదా అనుబంధ సంస్థ సిరియాకు చెందిన అల్ నుస్రా ఫ్రంట్ తో కలిసి ఈ 'స్మార్ట్' తయారుచేస్తున్నట్టు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News