: నిప్పుతో ట్రీట్ మెంట్..!


చైనాలో ఓ ఫిజియోథెరపిస్ట్ వినూత్న తరహాలో చికిత్స చేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. ఇతగాడు వైద్యవిధానంలో ఉపయోగించే ప్రధాన ఔషథం... అగ్ని! రోగిపై ఓ కండువా వేసి దానిపై ఆల్కహాల్ పోస్తాడు. ఆ తర్వాత, కండువాకు నిప్పుపెడతాడు. దాంతో, రోగ నివారణ జరిగిపోతుందట. ఇలా మానసిక ఒత్తిళ్ళు, అజీర్ణం, సంతానలేమితో పాటు ప్రాణాంతక క్యాన్సర్ నూ నయం చేస్తాడట. నిప్పు సాయంతో తాను చేసే వైద్యానికి 'ఫైర్ థెరపీ' అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఇతని పేరు ఝాంగ్ ఫెంఘారో. బీజింగ్ లో నివసించే ఈ థెరపిస్ట్ కు కొందరు శిష్యులు కూడా ఉన్నారు. వీరి నుంచి ఫీజు వసూలు చేస్తూ, ఫైర్ థెరపీలో శిక్షణ ఇస్తున్నాడు.
తన వైద్య విధానం గురించి మాట్లాడుతూ, మానవ చరిత్రలో ఇది నాలుగో విప్లవమని... చైనీస్, పాశ్చాత్య వైద్య విధానాలను ఇది తోసిరాజంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ఫైర్ థెరపీ... ఆపరేషన్ల బాధ నుంచి విముక్తి కలిగిస్తుందని తెలిపాడు ఝాంగ్. శరీరంపైన మంట వెలిగిస్తే అది లోపలి చల్లదనాన్ని తొలగిస్తుందని, తద్వారా రోగనివారణ జరుగుతుందని సెలవిచ్చాడు.

  • Loading...

More Telugu News