: ఏపీ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో వంద రోజుల ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్ లోని రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో వంద రోజుల ప్రత్యేక ప్రణాళికను ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ, రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల మధ్య భూముల ధరలు ఒకేలా ఉండేలా చూస్తామని చెప్పారు. అంతేగాక మీ-సేవ ద్వారా రైతులకు విస్తృత సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, కుల ధ్రువీకరణ పత్రాల జారీని గ్రామస్థాయికి తీసుకువెళ్తామని వివరించారు. రాయలసీమను పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక విజయవాడ, విశాఖలో ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.