: బాలీవుడ్ నటుడు ప్రాణ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రాణ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ నటుడిగా దాదాపు 350 చిత్రాలలో ప్రాణ్ నటించారు. తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన 'కొదమసింహం' చిత్రంలో కూడా ఆయన నటించారు. ఆయన అసలు పేరు ప్రాణ్ క్రిషణ్ సింకద్. ప్రస్తుతం ఆయనకు 92 సంవత్సరాలు.