: కేసీఆర్ సర్కారుకు రిజర్వ్ బ్యాంకు షాక్


ఎన్నికల వేళ రైతుల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కేసీఆర్ కు రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం శరాఘాతంలా తాకింది. రుణమాఫీ అంశం ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయమని, అందులో బ్యాంకులను ఎలా భాగస్వాములు చేస్తారని ఆర్బీఐ ప్రశ్నించింది. అయితే, రుణాలను రీషెడ్యూల్ (దీర్ఘకాలిక రుణాలు) చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు శుక్రవారం ముంబయిలో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తో భేటీ అయ్యారు.
రుణమాఫీ చేయాలని వారు కోరగా, సాధ్యంకాదని ఆయన వారితో చెప్పినట్టు సమాచారం. రుణ మొత్తాన్ని తెలంగాణ సర్కారు ఆరేడేళ్ళలో వడ్డీ సహా చెల్లిస్తుందని వివరించినా, రాజన్ తన నిర్ణయానికి కట్టుబడినట్టు తెలుస్తోంది. రైతుల రుణాలు మాఫీ చేసుకుంటూ పోతే బ్యాంకుల పరిస్థితి అధ్వానంగా తయారవుతుందని ఆయన వ్యాఖ్యానించారని టి-వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News