: నర్సులను ఇలా విడిపించారు..!
ఇరాక్ లో నర్సుల విడుదల మోడీ సర్కారుకు దౌత్యపరంగా అద్భుతమైన విజయమే అని చెప్పుకోవచ్చు. కరడుగట్టిన తీవ్రవాదుల చెర నుంచి బొట్టు రక్తం చిందకుండా బందీలను విడిపించడం మామూలు విషయం కాదు. ఇందుకోసం కేంద్రం సర్వశక్తులూ ఒడ్డింది. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అన్ని పనులు మానుకుని నర్సుల వ్యవహారంపైనే దృష్టిపెట్టారు.
గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులతో ఆమె నిరంతరం టచ్ లో ఉన్నారు. ఏంచేస్తే, ఎవరిని కలిస్తే సమస్య పరిష్కారం అవుతుందో తెలుసుకుని, సరిగ్గా గురి చూసి బాణాలు విసిరారు. ఇరాక్ లో ఐఎస్ఐఎస్ ప్రాబల్య ప్రాంతానికి సమీప దేశాలైన జోర్డాన్, సిరియా, టర్కీ ప్రభుత్వ వర్గాలతో చర్చోపచర్చలు జరిపారు. ఎట్టకేలకు మిలిటెంట్లను నర్సుల విడుదలకు ఒప్పించగలిగారు.
కాగా, నర్సుల విడుదల కోసం కొన్ని అనధికార మార్గాల్లోనూ ప్రయత్నాలు సాగినట్టు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు.