: పూడిక తీస్తుంటే 18 పంచలోహ విగ్రహాలు దొరికాయ్
తమ ఊరిలో ఉన్న చెరువులో పూడికతీత పనులను గ్రామస్తులు చేపట్టారు. అయితే, ఆశ్చర్యం గొలిపే విధంగా ఏకంగా 18 పంచలోహ విగ్రహాలు వారికి దొరికాయి. వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులు గ్రామ సర్పంచికి తెలియజేశారు. ఆయన వెంటనే జిల్లా రెవెన్యూ అధికారులకు విషయాన్ని చేరవేశారు. రెవెన్యూ అధికారులు ఆ గ్రామానికి చేరుకుని పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా ఆనందపురం మండలం గండిగుండాంలో నిన్న జరిగింది.