: మోడీ నియోజకవర్గంలో కుక్కల బెడద
ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని యూపీ సర్కారు పేర్కొంది. వీటికి తోడు ప్రజలపై కోతులూ తమ ప్రతాపం చూపిస్తున్నాయట. రోజుకు 400 వందల మందికి పైగా వీటి బారిన పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు పెద్ద సంఖ్యలో వారణాసి ప్రజలు వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో యాంటీ రేబీస్ టీకాలు వేయించుకుంటున్నారు.
ఈ మేరకు యూపీ అసెంబ్లీలో ఆరోగ్య మంత్రి శంఖ్ లాల్ మంఝి వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్ దేవ్ రాయ్ చౌధరీ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ మంఝి పై వివరాలు తెలిపారు.