: గెలిచినా బ్రెజిల్ కు షాక్ తప్పలేదు!
సొంతగడ్డపై జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో బ్రెజిల్ నెగ్గినా ఆ ఆనందం వారికి మిగల్లేదు. కారణం, స్టార్ ఫార్వర్డ్ నేమార్ తీవ్రంగా గాయపడి సెమీస్ కు దూరమవడమే. కొలంబియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో బ్రెజిల్ 2-1తో విజయభేరి మోగించింది. అయితే, బంతితో ముందుకు దూసుకెళుతున్న నేమార్ ను కొలంబియా ఆటగాడు జునిగా వెనకనుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో, ఈ బక్కపలుచని ఫార్వర్డ్ బాధతో విలవిల్లాడుతూ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని డగౌట్ కు తరలించారు. వైద్యులు అతడికి కొన్ని రోజుల విశ్రాంతి అవసరమని సూచించడంతో సెమీఫైనల్ కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.