: సింగిల్ గోల్ తో సెమీస్ కు


టైటిల్ ఫేవరెట్ జర్మనీ ఫిఫా వరల్డ్ కప్ లో సెమీఫైనల్లోకి దూసుకెళ్ళింది. ఫ్రాన్స్ తో హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో సింగిల్ గోల్ తో టైటిల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. మ్యాచ్ 13వ నిమిషంలో మాట్ హమ్మెల్స్ గోల్ సాధించి జర్మనీని ఆధిక్యంలో నిలిపాడు. అయితే, ఆ తర్వాత ఇరు జట్లు గోల్ కోసం చెమటోడ్చినా ఫలితం దక్కలేదు. ముఖ్యంగా జర్మనీ గోల్ కీపర్ మాన్యువల్ న్యూర్ ఫ్రెంచ్ దాడులకు అడ్డుగోడలా నిలిచాడు. పలుసార్లు ప్రత్యర్థి ఫార్వర్డ్ ల దాడులను సమర్థంగా నిలువరించి వారి గెలుపు ఆశలపై నీళ్ళు చల్లాడు.

  • Loading...

More Telugu News