: ఒక్క క్షణం రైల్వే స్టేషన్ మొత్తానికి ఒళ్లు గగుర్పొడిచింది!
చైనాలో రైళ్లు వేగానికి నకళ్లు. అయితే, అంతటి వేగాన్నీ క్షణాల్లో అదుపులోకి తేగల సాంకేతికత, నైపుణ్యం చైనా రైళ్లకు, ఆ డ్రైవర్లకు ఉన్నాయనడానికి ఇదో నిదర్శనం! బీజింగ్ లోని ఓ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై నడుస్తున్న ఓ మహిళ... అల్లంత దూరంలో ట్రైన్ వస్తుండగా అకస్మాత్తుగా అందరూ చూస్తుండగా ఫ్లాట్ ఫాంపై నుంచి ట్రాక్ పై పడిపోయింది.
అప్పటికే వేగంగా వస్తున్న రైలు ఆమెపైకి దూసుకొచ్చేసింది. స్టేషన్ లోని ఫ్లాట్ ఫాంపై ఉన్నవారంతా ఎంత దారుణం జరిగిపోయిందని బాధపడిపోయారు. ఆమె పడిపోవడం చూసిన ట్రైన్ డ్రైవర్ క్షణాల్లో స్పందించి, రైలును అదుపు చేశాడు. చిన్న గాయాలతో ఆమె రైలు కింది నుంచి బయటికి వచ్చింది. అప్పడు అందరూ ఆమె గర్భిణి అని గ్రహించారు. అంతే ఆనందంతో ఆమెకు చేయందించి, ఊపిరి పీల్చుకున్నారు.