: తెలంగాణలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష
కొన్ని రోజుల్లో పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సాయంత్రం సమీక్ష నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ వాస్తవ, రైల్వే అధికారులు కూడా దీనికి హాజరయ్యారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఇందుకు కేంద్రం నుంచి నిధులు రప్పించడంతో పాటు రైల్వే ఆధునికీకరణకు సత్వర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. పలు లైన్ల అభివృద్ధికి కృషి చేయాలని, సికింద్రాబాద్ స్టేషన్ ను సమూలంగా మార్చాలని ఆయన సూచించారు.