: అంబానీ ఇల్లైతే మాత్రం...దానికెక్కువా?


అంబానీ ఇల్లైతే మాత్రం దానికి ఎక్కువా? అంటూ సోషల్ మీడియాలో ఆంటీలియా ఫోటో పెట్టి మరీ కామెంట్లు చేస్తున్నారు. ముంబైలో గత రెండు రోజులుగా భారీ వర్షం కురిసింది. పేదోడైనా, ధనవంతుడైనా ప్రకృతికి సమానమే. ప్రపంచలోనే అత్యంత ఖరీదైన ఇల్లు, 'ధనవంతుల్లో కెల్లా ధనవంతుడి ఇల్లు' అంటూ ఫోర్బ్స్ ఇండియా నుంచి హఫ్పింగ్టన్ పోస్ట్ వరకు అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైన డిజైనర్ ఇల్లు అంటీలియా. అందులో ప్రతిదీ విలువైనదే, కళాఖండమే. అందుకే ఏ ఒక్కటీ కూడా వానకు తడవకుండా, ఎండకు ఎండకుండా చర్యలు తీసుకున్నారు ఆర్కిటెక్టులు.
ఇప్పుడు ముంబైని భారీ వర్షం ముంచెత్తడంతో, వర్షం నీరు అంటీలియాలో చేరకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్లు కప్పారు. దీంతో ప్రకృతికి అందరూ సమానమే...అంబానీ ఇల్లయితే మాత్రం ఏంటి గొప్ప? అంటూ ఫోటో సహా సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేస్తున్నారు. కాగా, పేదోడి ఇంటికి ఓ టర్పాలిన్ కవర్ అయితే సరిపోతుంది. అంబానీ అంటీలియాను వర్షం బారినుంచి కవర్ చేసేందుకు కిలోమీటర్ల పొడవు టర్పాలిన్ కావాల్సి వచ్చిందంట.

  • Loading...

More Telugu News