: ‘కరెంట్ తీగ’ ఫైట్ సీన్స్ తీస్తుండగా... మంచు మనోజ్ కు గాయాలు


మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ తాజాగా నటిస్తున్న ‘కరెంట్ తీగ’ షూటింగ్ లో గాయపడ్డాడని తెలిసింది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మంటల్లో పైట్ సీన్స్ తీస్తుండగా మనోజ్ కు మంటలు అంటుకోవడంతో గాయపడ్డాడని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందన్న సమాచారం మాత్రం తెలియరాలేదు. ఇంతకు ముందు మనోజ్ ‘మిస్టర్ నూకయ్య’, ‘పోటుగాడు’ సినిమా షూటింగ్ సమయంలోనూ గాయాల పాలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News