: ఐఐటీ చదివారు... ఉన్నత కొలువులు కాదన్నారు


ప్రతిష్ఠాత్మక ఖరగ్ పూర్ ఐఐటీలో వారిద్దరూ పట్టభద్రులయ్యారు. తమ కలలు నెరవేర్చుకునేందుకు ఆ ఇద్దరూ మాగ్మాఫిన్ కార్ప్, స్క్వైర్ లాంటి అంతర్జాతీయ కంపెనీల నుంచి భారీ వేతనంతో వచ్చిన కొలువులను కూడా కాలదన్నారు. రాజస్థాన్ లోని బికనీర్ కు చెందిన పంకజ్, ఆచల్ ఇద్దరూ స్నేహితులు. కోటా అనే ప్రాంతంలో వీరిద్దరూ ఐఐటీ కోచింగ్ తీసుకుంటుండగా సరైన తిండి దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కోసారి తిండి దొరికేది కాదు. దొరికినా నాణ్యత ఉండేది కాదు. అలా ఇబ్బందులు పడ్డ ప్రతిసారి మంచి హోటల్ ఉంటే బాగుంటుందని అనుకునేవారు. తర్వాత ఐఐటీలో సీట్లు రావడం... చేరడం జరిగిపోయింది. ఇప్పుడు కోర్స్ పూర్తి చేసిన తరువాత గతం గుర్తు చేసుకుని, తామే ఎందుకు ఓ టిఫిన్ సెంటర్ పెట్టకూడదని ఆలోచించారు. అంతే, ఆలోచన అమలు చేశారు. ఐఐటీ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు శుచి, శుభ్రత కలిగిన నాణ్యమైన ఆహారం సరసమైన ధరకు అందించే హోటల్ జనవరిలో ప్రారంభించారు. ఇప్పుడు తమకు 250 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదిచ్చిన స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా చైన్ హోటళ్లు పెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారీ పట్టభద్రులు.

  • Loading...

More Telugu News