: శివసేన దోస్తీకి బీజేపీ కటీఫ్!


ఎన్డీఏ సంకీర్ణంలో శివసేన ఓ ప్రధాన భాగస్వామి. అయితే, ప్రాంతీయ పార్టీగా కేంద్రానికి మద్దతిస్తున్నప్పటికీ బీజేపీ తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు నిర్ద్వందంగా పార్టీ పత్రిక 'సామ్నా'లో వ్యతిరేకిస్తుంది. అయితే, తాజాగా ఆ పార్టీతో రెండు దశాబ్దాలకు పైగా ఉన్న సంబంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని మహారాష్ట్రలోని అత్యధిక బీజేపీ నేతలు భావిస్తున్నట్టు వినికిడి. ఇందుకు కారణం అక్టోబర్ లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే. ఇందుకు కేంద్ర నేతలు కూడా సరే అంటున్నట్టు సమాచారం. ఈ మేరకు ముంబయిలోని అంధేరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరుగుతున్న పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం సందర్భంగా ఓ సీనియర్ నేత మాట్లాడుతూ, "రెండు దశాబ్దాల్లో ఇలా ఆలోచించడం ఇదే తొలిసారి. సేనతో విడిపోయేందుకు మేము సిద్ధంగా ఉన్నాం" అని చెప్పారు. అయితే, ఈ నిర్ణయం కష్టతరమైనది అయినప్పటికీ వెంటనే బీజేపీ బహిరంగంగా ప్రకటించాలని అంటున్నారు. మరి ఈ ఆలోచన బీజేపీ అగ్రనాయకత్వ మదిలో ఉందో? లేదో?

  • Loading...

More Telugu News