: ఘర్షణలతో పలు చోట్ల ఎంపీపీ ఎన్నికలు వాయిదా
పలు చోట్ల ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణల్లో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలోనూ వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. విశాఖ జిల్లా అరకులో కోరం లేకపోవడంతో ఎంపీపీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.