: సిద్ధూని రాహుల్ గాంధీ ఆహ్వానిస్తారా..!?


రాజకీయాల్లో ఇమడలేక అస్త్ర సన్యాసం చేసేందుకు సిద్ధపడ్డ భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు కాంగ్రెస్ కండువా కప్పేందుకు కొందరు నేతలు తహతహలాడుతున్నారు. బీజేపీ తన భర్తను అలక్ష్యం చేస్తోందంటూ ఈ డాషింగ్ ఓపెనర్ భార్య సంచలనాత్మక ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. సిద్ధూని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలంటూ పశ్చిమ అమృత్ సర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ వెర్కా.. రాహుల్ గాంధీకి ఓ లేఖ రాశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'సిద్ధూ తల్లి రెండు సార్లు కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేశారు. సిద్ధూ తండ్రి పాటియాలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడిస్తేనే మంచిది కదా? కానీ, బీజేపీలో చేరడం ద్వారా సిద్ధూ తప్పటడుగు వేశారు. అపసవ్యమైన పార్టీలో సవ్యమైన వ్యక్తి సిద్ధూ. అందుకే అతన్ని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని కోరుతున్నాం' అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News