: రాజ్ కపూర్ మనవడికి షారూఖ్, కరణ్ జోహర్ కితాబులు
దివంగత నటుడు రాజ్ కపూర్ మనవడు, కరిష్మా, కరీనా, రణబీర్ కపూర్ ల సోదరుడు అర్మాన్ జైన్ సినీ రంగప్రవేశంపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. లేకర్ హమ్ దీవాన్ దిల్ సినిమాతో వెండితెరకు పరిచయమైన అర్మాన్ జైన్ తొలి అడుగు బాగుందని బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ అభినందించారు. అర్మాన్ వేసిన తొలి అడుగు సినిమా ప్రపంచానికి ఆనందం కలిగిస్తోందని షారూఖ్ ట్వీట్ చేశాడు.
రాజ్ కపూర్ మనవడైన అర్మాన్ జైన్ కలలు సాకారం కావాలని ఆయన ఆకాంక్షించారు. తొలిసినిమాలోనే అర్మాన్ జైన్, దీక్షా సేథ్ జోడీ ఆకట్టుకుందని ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ అభిప్రాయపడ్డారు. సినిమాలో వారి జోడీ ఆకట్టుకుందని ఆయన తెలిపారు.