: వంటగ్యాస్, కిరోసిన్ ధరలను భారీగా పెంచనున్న కేంద్రం
దేశ ప్రజలపై వంటగ్యాస్, కిరోసిన్ ధరల రూపంలో భారీ వడ్డనకు కేంద్రం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.250, కిరోసిన్ ధరను రూ.4 నుంచి రూ.5 రూపాయలు పెంచాలన్న కిరీట్ పరీఖ్ కమిటీ సిఫార్సులను పరిశీలిస్తోంది. త్వరలో దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ నిర్ణయం తీసుకోనుంది. కొన్నిరోజుల కిందటే రాయితీయేతర సిలిండర్ పై రూ.16.48 పైసలు పెంచడంతో బాటు, పెట్రోల్, డీజిల్ ధరలను కూడా కొంతమేర పెంచిన సంగతి తెలిసిందే.