: రియల్టర్లకు చంద్రబాబు బ్రేక్


రాజధాని గుంటూరు జిల్లాలోనే అని నిర్ధారణ కావడంతో అక్కడ భూముల ధరలు అమాంతం పెరిగిపోవడం తెలిసిందే. ఎక్కడెక్కడినుండో రెక్కలు కట్టుకుని వాలిన రియల్టర్లు అక్కడ భూములను పెద్ద ఎత్తున కొని తమ అధీనంలో ఉంచుకున్నారు. ఇప్పుడు అక్కడ భూసేకరణ జరపాలంటే ఓ రకంగా ప్రభుత్వానికి తలకు మించిన భారమే. దీంతో, సీఎం చంద్రబాబు నాయుడు ఓ ఎత్తుగడతో రియల్టర్లకు చెక్ పెట్టొచ్చని భావిస్తూ, గుంటూరు జిల్లాలో ప్రైవేటు భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా భూముల ధరలు నేలకు దిగి వస్తాయన్నది సీఎం నిర్ణయం వెనకున్న వ్యూహంగా కనిపిస్తోంది.
అయితే, ఇప్పుడు కాకపోయినా, మరో నెల తర్వాతైనా భూసేకరణ జరపాల్సి ఉంటుందని, అప్పుడైనా మార్కెట్ ధర ఇవ్వాల్సిందే కదా అన్నది అధికారుల వాదన!

  • Loading...

More Telugu News