: ఏపీఎన్జీవోల భూములను వెనక్కి తీసుకోవడంపై జగన్ అభ్యంతరం


ఏపీఎన్జీవోల హౌసింగ్ సొసైటీకి 2005లో ఇచ్చిన 189 ఎకరాల 14 గుంటల భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు ఆ భూములను ఏపీఎన్జీవోలకు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఆ భూములను ప్లాట్లుగా విభజించుకుని విద్యుత్, రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం కోట్లు ఖర్చు పెట్టారని జగన్ అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎన్జీవోలకు న్యాయం చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News