: పీజీ మెడికల్ కౌన్సెలింగ్ పై పిటిషన్ కొట్టివేత
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ పీజీ మెడికల్ కౌన్సెలింగ్ నిలిపివేయాలంటూ కొన్ని రోజుల కిందట దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రెండవసారి ప్రవేశపరీక్ష నిర్వహించినప్పుడు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదని పిటిషన్ దారుని ప్రశ్నించింది. కాగా, ఇప్పటికే మెడికల్ కౌన్సెలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే.