: శ్రీవారి సేవా భాగ్యం ఎవరికి దక్కేనో..?


నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోయినా, ఆశావహులు మాత్రం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవికి విపరీతమైన పోటీ నెలకొని ఉంది. టీటీడీ చైర్మన్ పదవిని సమర్థత ఉన్న వ్యక్తికి అప్పగించడం ద్వారా, తిరుమలలో పేరుకుపోయిన అవినీతిని ఊడ్చిపారేయాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి కోసం పలు పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు రేసులో ముందున్నట్టు సమాచారం. టీటీడీ చైర్మన్ పదవి పొందడం తన జీవితకాల లక్ష్యమని స్వయంగా రాయపాటి పేర్కొన్నారు కూడా.
ఇక ఈ రేసులో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి కూడా ఉన్నారు. కాగా, టీటీడీ బోర్డులో సభ్యుల నియామకం పట్ల కూడా ఆసక్తి నెలకొంది. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎక్స్ అఫిషియో సభ్యులను మినహాయిస్తే మిగతా సభ్యత్వాల కోసం గట్టిపోటీ నెలకొంది. ఎన్నికల ప్రచారం వేళ ఓ బ్రాహ్మణుడికీ టీటీడీ బోర్డులో సభ్యత్వం కల్పిస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీని ఆధారంగా చేసుకుని, బ్రాహ్మణ వర్గం కూడా బరిలో దిగినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News