: అమ్మాయిని వేధించి తన్నులు తిన్న ఉపాధ్యాయుడు


విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా లేపాక్షి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పింది.
దీంతో బాలిక తల్లిదండ్రులు, స్థానికులతో కలిసి పెద్ద సంఖ్యలో స్కూల్ కు చేరుకుని ఉపాధ్యాయుడికి బడితెపూజ చేశారు. ఉపాధ్యాయుడ్ని స్కూల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News