: బందరులోని ఓ వీధికి పింగళి వెంకయ్య పేరు పెడతాం: మచిలీపట్నం మున్సిపల్ ఛైర్మన్


మచిలీపట్నం మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేసి... పట్టణంలోని ఒక వీధికి పింగళి వెంకయ్య పేరు పెట్టనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ ఎం.వి.బాబా ప్రసాద్ తెలిపారు. పింగళికి భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన చెప్పారు. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య వర్ధంతి వేడుకల్లో మున్సిపల్ ఛైర్మన్ పాల్గొన్నారు. పట్టణంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న పింగళి వెంకయ్య విగ్రహానికి మున్సిపల్ ఛైర్మన్ తో పాటు నిడుమోలు వెంకటేశ్వర ప్రసాద్, పలువురు కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News