: ప్రజాకాంక్షలు నెరవేర్చడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైంది: ప్రకాశ్ కారత్
ప్రజాకాంక్షలు నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోడీ విఫలమయ్యారని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ ధ్వజమెత్తారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నికయ్యాక జీవితాల్లో గణనీయమైన మార్పువస్తుందని ప్రజలు ఆశించారని, ఛార్జీలు పెంచి, ధరలను నియంత్రించకుండా ప్రజలు ఆశించని మార్పు చూపించారని అన్నారు. ఇంధన ధరలపై నియంత్రణ ఎత్తివేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిదాన్నీ ప్రైవేటీకరణ చేస్తే ప్రభుత్వాలు ఉండి ఉపయోగం ఏమిటని ఆయన నిలదీశారు. మోడీ చెబుతున్న కఠిన నిర్ణయాలు ప్రజలపై భారం మోపేందుకేనని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని ఆయన హెచ్చరించారు. బెంగాల్ లో లెఫ్ట్ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.